ప్రభుత్వ భూముల విక్రయ జివోను రద్దు చేయాలి : మాచర్ల బిజెపి నాయకులు



గుంటూరు జిల్లా మాచర్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై మాచర్ల బిజెపి పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది . గత సంవత్సర కాలంగా వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని , ప్రస్తుత కరోనా కాలంలో విధ్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల పై భారాన్ని మోపారని అలాగే ప్రభుత్వ భూముల అమ్మకాల జీవో ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . 

ఈ కార్యక్రమంలో మాచర్ల అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి కోటేశ్వర రావు యాదవ్, పట్టణ అధ్యక్షులు గుమ్మడి నాసరయ్య , టంగుటూరి సాయి శర్మ , ఓరు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు 

0/Post a Comment/Comments

Previous Post Next Post