భార్యని చంపడానికి నాగుపాము తెచ్చిన కిరాతక భర్త



కేరళలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తూ, భార్యను అంతమొందించేందుకు ఓ భర్త పన్నిన కుట్ర గురించి తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.... కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సురేశ్, ఉత్తర భార్యభర్తలు. సురేశ్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా సురేశ్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ప్రయోజనం లేకపోవడంతో భార్యను తెలివిగా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి నెలలో ఓ వ్యక్తికి రూ.10 వేలు చెల్లించి రక్తపింజరి పామును తీసుకువచ్చి తమ బెడ్రూంలో వదిలాడు. ఆ పామును చూసి హడలిపోయిన ఉత్తర దాన్నుంచి తప్పించుకునే క్రమంలో కాటుకు గురైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొంది క్షేమంగా బయటపడింది. అయితే, ఈసారి సురేశ్ నాగుపామును తెప్పించాడు. పుట్టింట్లో ఉన్న ఉత్తర నిద్రపోతున్న గదిలో ఆ విషసర్పాన్ని వదిలాడు. ఆ పాము ఉత్తరను కాటేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి అదృష్టం ముఖం చాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఉత్తర ప్రాణాలు విడిచింది.తన కుమార్తెను రెండు సార్లు పాము కరవడంపై అనుమానం వచ్చిన ఉత్తర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త సురేశ్ ను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అతడి తెలివికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారట!

0/Post a Comment/Comments

Previous Post Next Post