ఇక నుండి ఆన్లైన్లో లాక్ డౌన్ పాసులు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్



కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా అత్యవసర, నిత్యావసర అవసరాల నిమిత్తం లాక్ డౌన్ పాసుల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి సులువుగా పాసులు అందించడానికి తెలంగాణ రాష్ర్ట పోలీసు వారు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో పాసుల కోసం కావలసిన సమాచారాన్ని అందజేసి అత్యంత సులభంగా లాక్ డౌన్ పాసులను పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేసినారు.వివిధ రకాల కారణాలతో పాసుల కోసం ఇబ్బంది పడుతున్న వారు ఆన్లైన్ ద్వారా పోలీసు వారు అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇంటర్నెట్ గురించి అవగాహన లేని వారు సంభదిత పోలీస్ స్టేషన్లో గానీ,సబ్ డివిజన్ పోలీసు అధికారి ఆఫీస్ నందు గాని లాక్ డౌన్ పాసులను పొందవచ్చని తెలిపారు.ఈ రెండు పద్ధతుల ద్వారా లాక్ డౌన్ పాసులను పొందిన వారిని మాత్రమే పోలీసువారు అనుమతిస్తారని తెలియజేసారు.
Previous Post Next Post