గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో వారు అక్కడ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ, అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, వైద్య సదుపాయం కూడా అందకుండా పోతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆ మత్స్యకారులు ఎట్టకేలకు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. మత్స్యకారులను అధికారులు విడతల వారీగా ఏపీకి తీసుకువస్తున్నారు. ఈ రోజు మొత్తం 12 బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 887 మంది మత్స్యకారులు చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్దకు మత్స్యకారులు చేరుకున్నారు. వారికి జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. చెక్‌పోస్టు వద్ద మత్స్యకారులకు టిఫిన్, తాగునీరు అందించారు.
గుజరాత్ నుంచి శ్రీకాకుళానికి మొత్తం 700 మంది మత్స్యకారులు చేరుకున్నారు. అలాగే, విజయనగరం జిల్లాకు చెందిన 98 మంది, విశాఖ జిల్లాకు చెందిన 77 మంది మత్స్యకారులు ఏపీకి చేరుకున్నారు. వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనంతపురం నుంచి రాజస్థాన్‌కు వలస కూలీలను తరలిస్తున్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారందరినీ ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు.
Post a Comment