భారీ అగ్ని ప్రమాదంలో 1500 గుడిసెలు దగ్ధం



ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడ ప్రాంతంలో గత అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 1500కుపైగా పూరిగుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 28 యంత్రాలతో మంటలను అదుపు చేశారు.రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 2 ఎకరాల్లో ఉన్న 1500 పూరిగుడిసెలు కాలి బూడిదైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post