వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ శశాంక - అధికారుల పై ఆగ్రహించిన కలెక్టర్



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గుండ్లపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు గునుకుల కొండాపూర్ లో కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి ధాన్యమును కొనుగోలు చేసిన తర్వాత రశీదు ఇవ్వకపోవడంపై ఐకెపి నిర్వాహకులు తాసిల్దార్ ఐకేపీ ఏపీఎం లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల దగ్గర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తున్నారని మధ్యవర్తులు గా ఐకెపి కేంద్రాలు ఉంటున్నాయని అన్నారు తాసిల్దార్ ఐకెపి ఎపిఎం లకు రైతులకు అసౌకర్యం లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలన్నారు లేనిచో కఠిన చర్యలు తప్పవన్నారు ప్రతి కొనుగోలు కేంద్రాలలో ఏ బి గ్రేడ్ లను వేరు చేసి తూకం వేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రైతుకు తూకం వేసిన వెంటనే రశీదు అందజేయాలన్నారు ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు కానీ అందులో తాలు ఉండకూడదన్నారు కలెక్టర్ నిర్వాహకురాలు లావణ్య ను అడిగారు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపించాము అక్కడే తాలు ఉందని కటింగ్ చేస్తున్నామని తెలిపారు కలెక్టర్ మిల్లర్లకు రైతులకు సంబంధం లేదన్నారు రైతులకు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మధ్యవర్తిత్వం ఉంటుందన్నారు రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కొనుగోలు కేంద్రాలు ఉండవని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ అల్వాల కోటి,రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి,డి ఆర్ డిఓ పిడి వెంకటేశ్వరరావు, జిల్లా నోడల్ అధికారి మనోజ్ కుమార్,మండల నోడల్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్,   ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు సర్పంచులు బేతేలు సమత, లింగంపల్లి జ్యోతి, ఎమ్మార్వో కె రమేష్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, ఏవో కిరణ్మయి, ఐకెపి ఎపిఎం లావణ్య, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post