కర్నూల్ జిల్లా దేవనకొండ కు చెందిన ఆర్మీ జవానుని పోలీసులు అతి దారుణంగా కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది , కానీ ఈ నాటివరకు ఎస్సై , ఇద్దరు కానిస్టేబుళ్ల మీద పోలీసు ఉన్నతికారులు ఏ విధమైనటువంటి చెర్యలు తీసుకోలేదు . బాధిత జవాను లక్ష్మన్న..... పత్తికొండ రురల్ సిఐ కృష్ణయ్య ఆఫీసుకు కేసు పెట్టడానికి వెళితే కేసు తీసుకోకుండా... . ఫోన్ చేసినా సమాధానం చెప్పకుండా ...తప్పించుకు తిరుగుతున్నాడు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను చూసి కొందరు ఆర్మీ జవానులు లక్ష్మన్న దగ్గరకు వచ్చి పరామర్శించి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళితే రేపు రా ... మాపు రా అని గత నాలుగు రోజులుగా జవాన్ లక్ష్మన్నను మానసిఖంగా హింసిస్తున్నారు , జిల్లా ఎస్పీ కూడా ఈ విషయం పై స్పందించకుండా నిర్లక్షయంగా వ్యవహరిస్తున్నారు .
కొందరు జవానులు , ప్రజలు సియం జగన్ కి ట్విట్టర్ ద్వారా దాడికి పాల్పడిన పోలీసుల పై చెర్యలు తీసుకోవాలని కోరుతున్నారు , అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయం పై స్పందించడం లేదు , గొప్ప గొప్ప న్యూస్ చానెల్స్ ఈ న్యూస్ పై స్పందించక పోవడం గమనించదగ్గ విషయమైంది , ఎందుకు ఇలా జరిగింది అని అధికారులను అడిగితె రాత్రియంబళ్లు డ్యూటీ చేసి అలసిపోయారు అందుకే ఆలా అయిందేమో అని బాగా మాట్లాడుతున్నారు . మరి దేశ సరి హద్దులో రేయింబళ్లు , గాలికి వానకి అడుగడుగునా చావు ఉందని తెలిసి పోరాడున్న జవాను ది కష్టం కాదా ? బార్డర్ లో జవాను అనే వాడు లేకపోతె ... ఈ రాజకీయం , పోలీసు ఇదంతా ఉంటుందా ? ఒక్క సారి ఆలోచించాలి ? ఒక్క సారి మన జవానులు ఒక గంట కళ్ళు మూసుకుని వదిలేస్తే మన దేశం పరిస్థితి ఏంటి ? మనమందరం ఒక్కసారి ప్రశ్నించుకుందాం !!!
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సైనికుడి పై దాడికి పాల్పడిన ఎస్సై మారుతి , కానిస్టేబుళ్లు అశోక్ , మంజునాథ్ ల పై చెర్యలు తీసుకోవాలని ఆర్మీ జవానులు కోరుతున్నారు
Post a Comment