భార్యల నుంచి వేధింపులు ... హెల్ప్ లైన్ కావాలంటూ ప్రభుత్వానికి వినతి



లాక్ డౌన్ వేళ, ఇళ్లకే పరిమితమైన పురుషుల నుంచి తమిళనాడు ప్రభుత్వానికి విస్తుపోయే విజ్ఞాపన వచ్చింది. ఇంట్లో ఉన్న తాము భార్యల గృహ హింసను భరించలేకున్నామని, తమకు ఉపయోగపడేలా ఓ హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసి రక్షించాలని కోరుతూ, తమిళనాడు పురుషుల రక్షణ సంఘం సీఎం పళనిస్వామికి ఓ లేఖను రాసింది.వైరస్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న పురుషుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ లేఖలో పేర్కొన్న సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్, భార్యలు పెడుతున్న హింస భౌతికంగా, మానసికంగా పురుషులను ఇబ్బంది పెడుతోందని వాపోయారు. ఎంతో మంది మహిళలు సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపించి భర్తలను భయపెడుతున్నారని, ఇదే సమయంలో మహిళలను ఇబ్బంది పెడితే, అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించడంతో, పురుషులు ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. పురుషుల బాధను వ్యక్తపరిచేందుకు హెల్ప్ లైన్ అత్యవసరమని, దాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post