విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం దిన వేతన ఉద్యోగస్తులకు బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి



విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న  సెక్యూరిటీ మరియు దిన వేతన ఉద్యోగస్తులకు  విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యములో ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు గారు మరియు సచీవులు  డా. యల్ విజయకృష్ణా రెడ్డి గారు  10 కేజీల బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకులు మరియు 4 కేజీల 6 రకాల కూరగాయలును పంపిణి  చేశారు.  ఈ సందర్భముగా ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు మాట్లాడుతూ లాక్ డౌన్ వలన దిగువ మధ్యతరగతుల కుటుంబీకులతో పాటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు దిన వేతన ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందేనని వారికి విశ్వవిద్యాలయం బాసటగా నిలుస్తుందని అన్నారు. ఇంతటి విపత్కర సమయంలో కూడా ఎంతో కస్టపడి గత నెలరోజుల గా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్లను మరియు వాలంటీర్లను అభినందించారు. అందరు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు సహకరించి కోవిద్-19 ను సమిష్టిగా ఎదుర్కొందామని కోరారు.  సచీవులు  డా. యల్ విజయకృష్ణా రెడ్డి గారు కోవిద్-19 సోకకుండా మరియు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను వివరించారు. అందరూ బాధ్యతగా మెలగాలని కోరారు. డా. యల్ విజయకృష్ణా రెడ్డి గారు బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను ఒక్కొక్కరికి అందచేశారు.  ఈ కార్యక్రమంలో   NSS జిల్లా సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్, కృష్ణ చైతన్య డిగ్రీ కాళాశాల NSS వాలంటీర్లు మరియు NCC కాండిడేటెస్ పార్ధసారధి, రాజేష్, శివరాజ్, చైతన్య, అఖిల్, కావ్య మరియు జోస్త్న పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post