చెంజర్ల గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మానకొండూరు సీఐ సంతోష్ కుమార్



కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు అయినా సర్పంచ్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో వేణన్నా  యువసేన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు సీఐ సంతోష్ కుమార్,మండల పరిషత్ ఈఓపిఆర్డి దేవదాసు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు హాజరై కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో దాదాపు 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల కుమార్, తమ్మిశెట్టి రాజశేఖర్,బండి రాజశేఖర్,వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బోళ్ల ప్రవీణ్ మాట్లాడుతూ... భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించి 33 రోజులు గడుస్తున్నాప్పటికీ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిలువలు భారీగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యల్లో భాగంగా యువకులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున రక్త దానం చేయాలని పిలుపునిచ్చిన సందర్భంలో చెంజర్ల గ్రామంలో 80 శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారని అందులో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలతో వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారు తమ వంతు సహాయంగా చెంజర్ల గ్రామానికి వచ్చి భౌతిక దూరాన్ని పాటిస్తూ రక్తదానం చేసి విజయవంతం చేయడం కొరకు కృషి చేశారని  వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణాల్లో గ్రామాల్లో 18 సంవత్సరాలు దాటిన యువకులంతా ముందుకు వచ్చి భౌతిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం ఎలాంటి త్యాగమైనా చేయడానికైనా ముందు ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలని అన్నారు. అలాగే యువకులంతా ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా బ్లడ్ డొనేషన్ చేస్తూ రక్త నిల్వలను పెంచాలని కోరారు.అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కుందేలు అవుతున్నప్పటికీ దానిని నివారించడంలో కూడా యువకులు ఏకతాటిపైకి రావాలని రోజువారి కూలీలకు నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం చేయడం కొరకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post