ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సీఐ మహేష్ గౌడ్-ఎస్సై తిరుపతి దాత: తోట కోటేశ్వర్


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జంగాపల్లి ఎక్స్ రోడ్ ఆటో ఓనర్ అండ్ డ్రైవర్ యూనియన్ సభ్యులకు తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాళ్లపల్లి మహేష్ గౌడ్ చేతుల మీదుగా  మంత్రి గంగుల కమలాకర్ యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్ సహాయంతో ఆటో డ్రైవర్ల 50 మంది  కుటుంబాలకు   నిత్యావసర వస్తువులు  పంపిణీ చేశారు, అలాగే మైలారం గ్రామం అంబేద్కర్ కాలనీ చెందిన నిరుపేద కుటుంబాలకు,  గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ ఆటో యూనియన్ కుటంబాలకు సీఐ మహేష్ గౌడ్ ఎమ్మార్వో కె రమేష్ ఎస్ఐ ఆవుల తిరుపతి తోట కోటేశ్వర్ తో కలిసి పంపిణీ చేశారు. 

సీఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు  నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తోట కోటేశ్వర్ ని అభినందించారు. అన్నారు .  

 ఈ కార్యక్రమంలో మడికంటి శ్రీనివాస్ ,నూకల గంగ రాజు యాదవ్, తోట కోటేశ్వర్ యువసేన సభ్యులు అభిమానులు పాల్గొన్నారు


0/Post a Comment/Comments

Previous Post Next Post