మండల ప్రజలకు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు

కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మార్వో కె రమేష్ అన్నారు బుధవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో మండలంలోని 16 గ్రామల సర్పంచ్ లతో ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడారు అనంతరం మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కరోనా వైరస్ రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యంగా బస్సులో ప్రయాణాలు షాపింగ్ సమయంలో ఆఫీసుల్లో ఉండే వస్తువులను వాటి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని కాబట్టి తరచుగా చేతులను కడుగుతూ ఉండాలని సూచించారు ఎంపీడీవో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కుని ముక్కు నోటిని ముట్టుకోవద్దని జన సంద్రంలో తిరిగరాదని అన్నారు ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ మండలంలో గ్రామాల్లో యువకులు గుంపులు గుంపులుగా ఉండరాదని ముఖ్యంగా హోటల్లో ఉండరాదని అన్నారు గుంపులు గుంపులుగా ఉండి సెల్ఫోన్లతో టైం పాస్ చేసి ఉన్నచో వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అలాగే బయటి దేశాల నుండి వచ్చిన గన్నేరువరం మండలంలో పలు గ్రామాల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు వారికి సలహాలు సూచనలు చేశారు దేశం నుండి వచ్చిన కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యులతో దూరంగా ఉండాలని అన్నారు అలాగే మండల కేంద్రంలోని గురువారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు ఆవరణంలో ముందు గుంపులుగా ఉండరాదని ఎస్సై తిరుపతి తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post