ప్రభుత్వం చెప్పింది అర్థం చేసుకోండి...లాక్ డౌన్ పాటించండి : వి.సుధాకర్

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలంటూ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్రర్స్ అసోసియేషన్ – ఇండియా (PEMRAINDIA) జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ కోరారు . . అందరూ బాధ్యతగ వ్యవహరించాలని, వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని, వారందరికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు .

వైరస్ ప్రభావం తగ్గేంత వరకు అందరూ కొంతకాలం పాటు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కొందరు మాత్రం బయట ఎలా ఉందొ చూద్దామని బయటకు రావడం చేస్తున్నారని, ఇలాంటి కొందరి తప్పుల వలన వాస్తవంగ అవసరాలు ఉన్నవారు వచ్చినప్పుడు పోలీసుల చేతిలో దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు . కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వారికి, పోలీసులకు అందరూ సహకరించాలని, జర్నలిస్టులు పోలీసులు బేధాభిప్రాయాలకు తావివ్వకుండ ప్రస్తుతమున్న పరిస్థితులను సమర్ధవంతంగ ఎదుర్కోవాలని, కరోనా వైరస్ ని తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

https://www.pemraindia.org/archives/668

0/Post a Comment/Comments

Previous Post Next Post