నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ తెల్లవారుజామున తీహార్ జైలులో కట్టుదిట్టమైన చర్యల మధ్య దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం.. దోషుల మృతదేహాలను అరగంటపాటు ఉరికొయ్యలకు అలాగే వేలాడదీశారు. ఆ తర్వాత వాటిని కిందికి దించారు. అనంతరం వాటిని పరీక్షించిన వైద్యులు.. దోషులు నలుగురు చనిపోయినట్టు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. దోషులు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఒకే నేరానికి సంబంధించి ఒకేసారి నలుగురికీ మరణదండన అమలు చేయడం తీహార్ జైలులో ఇదే తొలిసారి. ఉరితీత అనంతరం నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
Post a Comment