‘కరోనా వైరస్’కు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఐతే దీనిపై ఈ రోజు మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంపట్ల ప్రజలు బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.దీనిపై ఆయన జాతికి క్షమాపణ చెప్పారు. దేశవ్యాప్తంగా తప్పనిసరిపరిస్థితుల్లో లాక్ డౌన్ విధించామని తెలిపారు. ‘కరోనా వైరస్’పై జరుగుతున్న అంతిమ యుద్ధంలో గెలుపు మనదే కావాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు అంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. సామాజిక దూరం పాటించడం .. ఏ మాత్రం సామాజికంగా అందరితో ఉన్న బంధాన్ని తెంచుకోవడం కాదన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని , క్వారంటైన్ లో ఉన్నవారిపట్ల చిన్న చూపుతో జనం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అంతే కాకుండా .. మన కోసం ముందు వరుసలో ఉండి సేవ చేస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులపై దురుసు ప్రవర్తన మంచిది కాదని సూచించారు. అక్కడక్కడా జరుగుతున్న ఘటనలు తన మనసుకు బాధ కలిగించాయన్నారు.
Post a Comment