కెటీర్ అన్నా మమ్మల్ని కాపాడండి ఆకలితొ అలమటిస్తున్నాం : కరింనగర్ జిల్లా వలస బాధితులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గల బేడ బుడగ జంగాల కాలనీ వాసులు 120 మంది 50 కుటుంబాలకు చెందినవారు జార్ఖండ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు బతుకుదెరువు కోసం వలస వెళ్లారు కరోనా వ్యాధి ప్రబలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయారు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్, కో డ్రామా, గ్రేడి, హాజారిబాగ్, జిల్లాలో 50 కుటుంబాల వారు జీవిస్తున్నారు అక్కడే స్థానిక సర్పంచులు ఊరి చివరన డేరాలలో ఉంచారు త్రాగునీటికి భొజనాలకి చిన్న పిల్లలు పెద్దలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి తీసుకురావడానికి సహకరించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్,  మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను వేడుకుంటున్నారు సిరిగిరి జోగెందర్,టేకు శ్రీనివాస్, జోషి కుమార్, పత్తి గంగారం, వాట్సాప్ ద్వారా అక్కడి పరిస్థితిని వీడియో తీసి ది రిపోర్టర్ టీవీ కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ రాజ్ కోటి కి పంపారు. వెంటనే నాయకులు అధికారులు స్పందించి తమను స్వస్థానాలకు తీసుకరావాలని బాధితులు వేడుకుంటున్నారు

 

https://www.youtube.com/watch?v=JvkTQtkyKRg

Post a Comment

Previous Post Next Post