కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణములో ఆదివారం మహిళా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మరియు సర్పంచ్ పుల్లెల లక్ష్మీ హాజరై మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితాలను గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు సమాజంలో మహిళలు పురుషులు సమానమేనని మహిళల పై వివక్ష తొలగాలని ఆకాంక్షించారు మగ పిల్లలకు బాల్యం నుంచే విద్య తో పాటు విలువలు వినయ విధేయతను తల్లిదండ్రులు నేర్పించాలని సూచించారు ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ న్యాత స్వప్న , ఐకెపి లావణ్య ఎంపీటీసీ బొడ్డు పుష్పలత కలిసి మండల గ్రామాల మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మండల మహిళ అధికారులకు గ్రామ వార్డు మహిళ సభ్యులకు, గ్రామ మహిళ ఐక్య సంఘాలకు ఆశా వర్కర్లకు, అంగన్వాడి టీచర్లకు, గ్రామ మహిళా సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్,బొడ్డు సునీల్, తెల్ల రవీందర్,పుల్లెల మల్లయ్య,కాంతల కిషన్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బూర శ్రీనివాస్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,వార్డ్ సభ్యులు పుల్లెల నరేందర్,బుర్ర జనార్ధన్ గౌడ్ కార్యదర్శి గాలి మోహన్,డా,,అజయ్ కారోబార్ మాధవరావు,న్యాత జీవన్,నక్క దామోదర్,చింతల నరసింహారెడ్డి, బోయిని అంజయ్య, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment