ఆహార పదార్థాలు సరఫరా చేసే ఆన్ లైన్ సంస్థల వాహనాలు, నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాల రాకపోకలకు అనుమతించాలని తెలంగాణ పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్, స్పెన్షర్ వంటి నిత్యావసరాలు సరఫరా చేసే వారి వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అడ్డుకోవద్దని సూచించారు. ప్రజలకు నిత్యావసరాలకు, ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు.
https://twitter.com/TelanganaDGP/status/1243055005008977921?s=19
Post a Comment