ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) షాకిచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్ ను కొట్టి వేసింది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. భద్రతా ఉపకరణాల కొనుగోళ్లలో నిబంధనలను ఆయన అతిక్రమించారని ఆరోపించింది. ప్రజాప్రయోజనాల రీత్యా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన క్యాట్… సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది.
Post a Comment