కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేటు నుండి ఒక టాటా సుమోలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారని పక్క సమాచారం మేరకు టోల్ గేట్ వద్ద కాపు కాచి ఒక టాటా సుమో నంబరు TS 02 EQ 4597 అనే వాహనాన్ని పట్టుకొని తనిఖీ చేయగా ఆ వాహనంలో సుమారు 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, అందులో ఒకరు చింతల వెంకటేష్ ,మరి ఒకరు కొమ్మరాజు కుమార్ లు అని, వీరు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వారుగా తెలిసినది. వీరు మానకొండూర్, కేశవపట్నం, హుజురాబాద్ మండలాలలోని గ్రామాలలో తిరుగుతూ ప్రజల వద్ద నుండి పీడీఎస్ బియ్యం ను కిలో ఎనిమిది రూపాయల చొప్పున కొనుగోలు చేసి ,టాటా సుమోలో వేసుకొని గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి దగ్గరలో గల పౌల్ట్రీ ఫార్మ్ కు కిలో 11 రూపాయల చొప్పున అమ్ముకొని అక్రమంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదిస్తున్నట్లు గా తెలిసినది వీరిని మరియు పిడిఎస్ రైస్ తో ఉన్న వాహనమును సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు ఈ రైడింగ్ లో టాస్క్ఫోర్స్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై వంశీకృష్ణ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపాల్గొన్నారు
Post a Comment