విద్యారంగానికి బడ్జెట్లో మొండిచేయి: AISB రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా:టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో మొండిచేయి చూపిందని AISB రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి 2020 -2021 సంవత్సరంలో కేవలం 6.69 %శాతం నిధులు కేటాయించడంతో ప్రభుత్వానికి విద్యారంగంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు పాఠశాల విద్య 10.421 కోట్లు ఉన్నత విద్యకు 1723 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యారంగానికి బడ్జెట్లో కొత్త విధిస్తుందని 2014-15 వ సంవత్సరంలో 10.89 %శాతం నిధులు కేటాయించి ఈ సంవత్సరం కేవలం 6.69% నిధులు కేటాయించడం బంగారు తెలంగాణ కు అభివృద్ధి సూచిక నా అన్నారు కొటారి కమిషన్ సిఫార్సులు ప్రకారం 30 % నిధులు కేటాయిస్తే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ప్రజలందరూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తే వాటిని పట్టించుకోకుండా నామమాత్రపు నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీన పరచాలని ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిధులు కేటాయించకపోవడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే విధంగా కుట్ర జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో AISB జిల్లా ఉపాధ్యక్షులు కేశిరెడ్డి రోహిత్ రెడ్డి జిల్లా కార్యదర్శి మెలుగురి హరికృష్ణ, జిల్లా నాయకులు హరీష్ రెడ్డి, సతీష్ రెడ్డి ,సోహెల్ ,పవన్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post