ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తులకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నేటి విచారణకు జగన్‌కు కోర్టు మినహాయింపు ఇవ్వడంతో ఆయన హాజరుకాలేదు. విచారణకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐపీఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హాజరయ్యారు. అలాగే, పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. అందరినీ ప్రశ్నించిన అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ, ఈడీ కోర్టు తెలిపింది.
Post a Comment