ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలను యూపీఎస్సీ వెబ్ సైట్లో పెట్టింది. సుమారు 796 పోస్టులను భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అందులో గత ఏడాదికి సంబంధించి డిసేబిలిటీ కేటగిరీకి చెందిన 24 పోస్టులు ఉన్నట్టు వెల్లడించారు. గత ఏడాది భర్తీ చేసిన పోస్టులు 896 కాగా.. ఈసారి వంద పోస్టులు తగ్గిపోయాయి. క్యాండిడేట్లు యూపీఎస్సీ వెబ్ సైట్ (upsconline.nic.in) ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Post a Comment