కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి రాక, పోకలపై వివరాలు వెల్లడించారు. ఆయా రంగాలకు కేంద్రం ఖర్చు పెడుతున్నది ఎంత, ఆదాయం వస్తున్నది ఎంత అనే వివరాలను సభలో వివరించారు.
కేంద్రం ఖర్చులు (రూపాయి పోక)
- కేంద్ర ప్రాయోజిక పథకాలు-9 శాతం
- సబ్సీడీలు- 6 శాతం
- వడ్డీ చెల్లింపులు- 18 శాతం
- రాష్ట్రాలకు పన్నుల వాటా- 20 శాతం
- రక్షణ రంగం- 8 శాతం
- కేంద్ర పథకాలు- 9 శాతం
- పింఛన్లు- 6 శాతం
- ఆర్థికసంఘం, ఇతర కేటాయింపులు- 10 శాతం
- ఇతర ఖర్చులు- 10 శాతం
కేంద్రానికి ఆదాయం (రూపాయి రాక)
- రుణాలు- 20 శాతం
- పన్నేతర ఆదాయం- 10 శాతం
- కస్టమ్స్ సుంకాలు- 4 శాతం
- కేంద్ర ఎక్సైజ్ పన్ను- 7 శాతం
- కార్పొరేట్ ట్యాక్స్- 18 శాతం
- జీఎస్టీ ఆదాయం- 18 శాతం
- ఆదాయపు పన్ను- 17 శాతం
- రుణేతర మూలధన వసూళ్లు- 6 శాతం
Post a Comment