విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నేతృత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు. తోట సీతారామ లక్ష్మి, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు.ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ బిల్లు, శాసన మండలి రద్దు, తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం మరికొందరు టీడీపీ నేతలతో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చిస్తారు.
Post a Comment