ఎపి ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశాల్లో ప్రవాసాంధ్రులు కూడా అమరావతి రాజధాని కోసం నిరసనలు తెలుపుతున్నారని కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ‘కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్న ప్రవాసాంధ్రులు వీళ్లు. అమరావతినే రాజధానిగా కొనసాగించమని విదేశీవీధుల్లో వీరు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిపై కక్ష, ద్వేషంతోనే ముందుకు పోతోంది’ అని ట్వీట్ చేశారు. ‘ప్రజల ఆకాంక్షకు కాకుండా తమ స్వార్థానికీ, ద్వేషానికీ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన నేతలు చరిత్రలో నియంతలుగానే మిగిలిపోయారు. తెలుగునేలపై అలాంటి హీన చరిత్రను సొంతం చేసుకుంటున్న మొదటి వ్యక్తి వైఎస్ జగన్’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని కోరుకుంటున్న ప్రవాసాంధ్రులు వీళ్ళు. అమరావతినే రాజధానిగా కొనసాగించమని విదేశీవీధుల్లో వీరు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిపై కక్ష, ద్వేషంతోనే ముందుకు పోతోంది(1/2)#MyCapitalAmaravati pic.twitter.com/vlMpYLTTH0
— Lokesh Nara (@naralokesh) January 27, 2020
Post a Comment