రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు

రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఈశాన్య గాలులతో ఉత్తర కోస్తాలో చలి స్వల్పంగా పెరిగింది. అయితే మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కోస్తాపైకి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే తూర్పుగాలుల ప్రభావం కొంతమేర తగ్గడంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా మాత్రమే వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం వరకు మార్కాపురం, దాడితోటల్లో ఒక్కొక్క సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post