ఐక్యరాజ్యసమితి: ఓ అఫ్రికన్ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది..సమావేశానికి హాజరైనా చైనా.. కశ్మీర్ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ అన్నారు. పాక్ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్ దృష్టి పెట్టాలని సూచించారు.కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐక్యారాజ్యసమితిలో లెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసి కొట్టింది. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని ఐరాస స్పష్టం చేసింది. పాక్ కుయుక్తులపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనపెట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కాగా కశ్మీర్ విషయంలో తొలి నుంచి పాక్‌కు చైనా మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా దాయాది దేశానికి డ్రాగన్ తప్ప మరే ఇతర సభ్య దేశాలు అండగా నిలవకపోవడం గమనార్హం. ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) బుధవారం రహస్య సమావేశానికి పిలుపునిచ్చింది. దీంట్లో చర్చించాల్సిన ఇతర అంశాల జాబితాలో కశ్మీర్ విషయాన్ని చేర్చాలని చైనా కోరింది. కానీ, ఇతర సభ్యదేశాలు అంగీకరించకపోవడంతో చైనాకు భంగపాటు తప్పలేదు. పైగా కశ్మీర్ భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.
credit: third party image reference
Post a Comment