గన్నేరువరం లో ఘనంగ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేశారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కె రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు, గ్రామ సచివాలయంలో పుల్లెల లక్ష్మి, చావడి వద్ద వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పశువుల వైద్యశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎన్ సి సి ఆధ్వర్యంలో గౌరవ వందనం పెరేడ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఎమ్మార్వో కె రమేష్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, ఎంపీటీసీ బొడ్డు పుష్పలత చంద్రమోహన్, మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు, బొడ్డు సునీల్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, విద్యా కమిటీ చైర్మన్ బుర్ర సత్యనారాయణ, వార్డ్ మెంబర్లు బుర్ర జనార్ధన్, రామంచ స్వామి, పుల్లెల నరేందర్, క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు అనంతరం పాఠశాలలో ఆటపాటలతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

 

0/Post a Comment/Comments

Previous Post Next Post