కొరటాల శివ దర్శకత్వంలో ఆఘమేఘాల్లో చిరుకి ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ స్పీడ్‌ను పెంచాడు కొరటాల. కొకాపేట్ లోని ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలలో చిత్రీకరణ జరుపుతున్నారు. మెగాస్టార్ కు ఇచ్చిన మాట ప్రకారం 80 నుంచి 99 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తిచేసి ప్యాక్ అప్ చెప్పాలి కాబట్టి ఆదిశగా యూనిట్ శ్రమిస్తోంది. మరి మెగాస్టార్ మాటిచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కండీషన్ ప్రకారం షూటింగ్ తక్కువ డేస్ లోనే పూర్తి చేయాలి కాబట్టి కొరటాల టీమ్ అందరికీ విరామం లేకుండా చుక్కలు చూపిస్తున్నాడుట.మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 152వ చిత్రం మొదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
మెగాస్టార్ ను సైతం వదలకుండా రేయింబవళ్లు షూటింగ్ చేస్తూనే ఉన్నారట. అదీ రాత్రిపూట చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చిరంజీవికి నిద్ర సరిపోవడం లేదని సమాచారం. చిరు 99 డేస్ కండీషన్ పెట్టడంతోనే కొరటాల ఇలా అందర్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని తెలుస్తోంది. సాధారణంగా కొరటాల ఒక్కో సినిమా చిత్రీకరణకు 130 నుంచి 140 రోజులు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
మరి అనుకున్న షెడ్యూల్ కన్నా 40 రోజుల ముందు ఇవ్వాలంటే ఈ మేరకు కష్టపడకపోతే కష్టమే అని కొరటాల పరుగులు పెడుతూ అందరితో పరుగులు పెట్టిస్తున్నారు. ఇకపోతే సినిమా షూటింగ్ వరకు పరుగులు పెడితే ఓకేగాని కథలో క్లారిటీ ఉంటదిగా అని కొంత మంది ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇకపోతే చిరు నటించిన ఇటీవలె విడుదలైన సైరా చిత్రం సూపర్‌డూపర్ హిట్ అయింది. అది కథ పరంగా సూపర్‌గా ఉన్నా కమర్షియల్‌గా మాత్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment