పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాంతంలో అదనపు బలగాల్ని మోహరించాలని నిర్ణయిం చింది. ఈ మేరకు నార్త్‌ కరోలినాలోని 82వ ఎయిర్‌బోర్న్‌ విభాగంలోని గ్లోబల్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ కు చెందిన 3000 నుంచి 3500 మంది సైనికుల్ని పంపనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అలాగే కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఇప్పటికే 700 మంది సైనికుల్ని మోహరింపజేశారు. అదనంగా మరో 3000 మంది సైనికుల్ని పంపనున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. టెహ్రన్‌లో వేలాది మంది నిరసనకారులు యూఎస్‌ జెండాలను తగలబెట్టి , ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవేళ ఇరాన్‌ ప్రతీకార దాడి చేపడితే ఎదుర్కోవడా నికే అమెరికా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post