హైదరాబాద్: టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులతో తెలంగాణ భవన్ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి రెండు నుంచి మూడుసార్లు వెళ్లి కలవండి. రాష్ట్రంలో 3వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బీజేపీకి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులే లేరు. బీఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురాలేదు. గెలుపు మనదే..అతివిశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నది. రూ.45వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్, సిరిసిల్ల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్న బీడీ కార్మికులను ఆదుకునేందుకు పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో బీడీ కార్మికులను ఆదుకుంటున్న ఏకైన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ. పేదింటి ఆడబిడ్డ పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అందజేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో మున్సిపాలిటీల్లో తక్కువ కరెంట్ ఉండేది. కానీ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాడు, నేడు ఉన్న ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలకు భారీగా నిధులిచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పట్టణాల్లో విద్యుత్, మంచినీటి సమస్య లేకుండా చేశాం. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. 75 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి 22 రోజుల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం. దేశంలోనే తెలంగాణ మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మున్సిపాలిటీల్లో 10 శాతం బడ్జెట్ గ్రీనరీ కోసం కేటాయించామన్నారు. ఎక్కడికక్కడా మ్యానిఫెస్టోలు రూపొందించుకుని ప్రచారం చేయండని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment