తెలంగాణ లో పలు చోట్ల భూకంపాలు

తెలంగాణలోని ఓ జిల్లాను భూకంపాలు జరుగుతున్నాయి . సాధారణంగా తెలంగాణకు భూకంపాల భయం ఉండదంటారు కానీ .. ఇటీవల ఆ జిల్లాలో వరుసగా భూమి కంపిస్తోంది . పది రోజుల్లో పదిసార్లు భూమి కంపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . సూర్యాపేట జిల్లా పరిధిలోని కృష్ణా నది పరీవాహక గ్రామాల్లో పది రోజు లుగా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి . ప్రధానంగా చింతలపాలెం , మేళ్లచెరువు మండలాల పరిధిలోని పదికిపైగా గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది . చింతలపాలెం మండల కేంద్రంతో పాటు , దొండపాడు , రామా పురం గ్రామాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది . దీనిపై ఆందోళన చెందుతున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు చెప్పారు . వీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు . వీరు సంబంధిత శాస్త్రవేత్తలతో మాట్లాడి .. ప్రకంపనలు నిజమేనని తేల్చారు . గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని పులి చింతల , గోవిందాపురం గ్రామాలు కేంద్రంగా చేసుకుని స్వల్ప ప్రకంపనలు వస్తున్నట్లు ధ్రువీకరించారు . ఈనెల 2 నుంచి 11 తేదీ మధ్యలో సుమారుగా పది సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు . వీటి తీవ్రత భూకంప లేఖినిపై 3.2, అంతకంటే తక్కువగా నమోదైంది .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post