మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు లో పురోగతి : 62 మంది సాక్షుల నుంచివాంగ్మూలాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిషోర్ కుమార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలుచేశారని ఈనాడు తెలిపింది. ఈ కేసులో 1,461 మంది అనుమానితులను విచారించామని ప్రమాణపత్రంలో చెప్పారు. అంతేగాక 62 మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశామని పేర్కొన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలనేందుకు పిటిషనర్/టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్ రవి) బలమైన కారణాలు పేర్కొనలేదని, కేసులో ఆయన్ను ఇరికించే యత్నం చేస్తున్నామన్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. రవి వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post