కరీంనగర్ జిల్లా : దోపిడీ కేసులో నిందితునిగా ఉండి గత 35 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితున్ని దేశవ్యాప్తంగా గాలిస్తూ బుధవారం నాడు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు గన్నేరువరం పోలీసులు వివరాల్లోకి వెళితే 1985 సంవత్సరంలో ప్రస్తుత గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో జరిగిన ఒక దోపిడీ కేసులో నిందితునిగా ఉండి తప్పించుక తిరుగుతున్న నిజాంబాద్ జిల్లా భీంగల్ కు చెందిన నిందితుడు వేముల భూమయ్య గత 35 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతూ పలు జిల్లాలో పని చేశాడు ఇటీవల అతను తన స్వగ్రామం భీంగల్ కు వచ్చి ఉంటున్నట్లు సమాచారం అందుకున్న గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు చెందిన వారెంట్లు సామాన్లు అమలు చేసే బృందానికి చెందిన కానిస్టేబుల్ టి కొమురయ్య, ఏ సంపత్ లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎస్సై ఆదేశాల మేరకు భీంగల్ ప్రాంతానికి వెళ్లి రహస్యంగా సమాచారాన్ని సేకరించి నిందితుడు వేముల భూమయ్యకు వారెంట్ ను అమలు చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు అతన్ని సదరు కేసు గురించి విచారించిన అనంతరం గురువారం రోజు కరీంనగర్ కోర్టులో హాజర్ పరచమని ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు
అభినందించిన పోలీస్ కమిషనర్ సిపి కమలాసన్ రెడ్డి
గత 35 సంవత్సరాలుగా నాన్ టీలబుల్ వారెంట్ అయి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు భూమయ్య ను అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వారెంట్ ను అమలు చేసి కోర్టులో హాజరు పరచడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ కొమురయ్య ను సంపత్ లతో పాటు గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు పైన పేర్కొన్న పోలీసులకు రివార్డులను ప్రకటించారు
Post a Comment