అశ్లీల వీడియోలను వీక్షించడం, పోర్న్ సమాచారాన్ని చదవడం భారత్ లో ఆందోళనకర స్థాయికి చేరుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో పోర్న్ మెటీరియల్ ను అప్ లోడ్ చేయడం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వాన్ని అమెరికా అలర్ట్ చేసింది. గత 5 నెలల కాలంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన 25 వేల వీడియోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని హెచ్చరించింది. ఈ మేరకు మన దేశానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ విభాగం సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ స్పందిస్తూ, ఈ విషయంలో ఢిల్లీ అగ్రభాగంలో ఉందని తెలిపింది. చైల్డ్ పోర్నోగ్రఫీ ఢిల్లీ నుంచే ఎక్కువగా అప్ లోడ్ అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా పలు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామని, అరెస్టులు కూడా కొనసాగుతున్నాయని చెప్పింది.ఈ నేపథ్యంలో, మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ, 1,700 కేసులను సైబర్ క్రైమ్ యూనిట్ కు ఫార్వర్డ్ చేశామని తెలిపారు.
Post a Comment