నేడు భారత్ బంద్‌ : పిలుపునిచ్చిన 10 ప్రధాన కార్మిక సంఘాలు

దేశవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో దాదాపు 25కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి.10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సమ్మెలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం వరకు ఈ బంద్ కొనసాగనుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. 
కాగా ఈ బంద్‌కు మద్దతుగా తాము విధులు బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఇండియా నేషనల్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర యూనియన్లు ప్రకటించాయి. దీంతో బ్యాంకింగ్, రవాణా రంగంపై బంద్ ఎఫెక్ట్ పడనుంది. మరోవైపు ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. డీఎంకే, ఎండీఎంకే, శివసేన, బిజూ జనతా దళ్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు.. ఈ బంద్‌లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ బంద్‌కు మద్దతివ్వలేదు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post