కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో బేటి బచావో- బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ బ్లాండినా ఆధ్వర్యంలో ఘనంగా బారసాల మరియు పుట్టిన పిల్లల తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో సురేందర్ రెడ్డి హాజరై ఆయన మాట్లాడుతూ గర్భంలో ఆడపిల్ల ఉందని గ్రహించి ఆపరేషన్ చేసుకోవడం సిగ్గుచేటన్నారు కేంద్ర ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో లాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం బాలికల అదృష్టమన్నారు బాలికల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు ఐకెపి ఎపిఎం లావణ్య మాట్లాడుతూ బాలికలను విద్యారంగంలో రాణింపు చేసి సమాజంలో గుర్తింపు పొందే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, సర్పంచ్ పుల్లెల లక్ష్మీ, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్, గంప వెంకన్న, పుల్లెల లక్ష్మణ్, ఆర్ఐ శంకర్, అంగన్వాడీ టీచర్స్ మరియు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment