*పెళ్లి రిసెప్షన్ రోజు ఈతకు వెళ్ళి తమ్ముడు మృతి. . .
*గుండెలు ఆవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు. .
ఈత సరదాలు ప్రాణాలు తిస్తున్నాయి . . పచ్చని తోరణాలతో,బందువులు రాకతో కళకళలాడుతున్న ఆ పెళ్లి ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది.సోదరి వివాహానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన నలుగురిలో ఒకరు మృతి చెందిన సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది….
వివారాల్లోకి వెళితే సైదాపూర్ ఎస్ఐ ప్రశాంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన భాషవేని రాజు(18) విద్యార్థి ఖమ్మంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు.ఈ నెల 6న శుక్రవారం సొంత సోదరి వివాహానికి స్నేహితులతో కలసి ఇంటికి వచ్చాడు. బంధువుల కోలాహలం మధ్య సోదరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.మరుపెండ్లికి సోదరి వద్దకు వెళ్లేందుకు అంతా సిద్ధమవుతుండగా రాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఊరు చెరువులోకి ఈతకు వెళ్లారు అక్కడ చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో రాజు అందులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చే లోపే రాజు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతుడి తండ్రి సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.సమ్మయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు కాగా ఒక్కగానొక్క కుమారుడు రాజు ఉన్నారు. రాజు ను మంచి చదువులు చదివించాలని ఖమ్మంలో పాలిటెక్నిక్ చదివిస్తున్నాడు కూతురి పెళ్ళికి వచ్చి చెరువులో పడి మృతి చెందారన్న వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది..
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment