భర్తతోపాటు వచ్చిన ఓ మహిళ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఘటన ఇది. అయితే బాధితులు తెలివిగా వందకు డయిల్ చేయడమేకాక, గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పలాయనం చిత్తగించారు.
వివరాల్లోకి వెళితే…నిన్నరాత్రి హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ కు దంపతులు చేరుకున్నారు. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు వీరిని అటకాయించారు. భర్తను బెదిరించి మహిళను బలవంతంగా లాక్కువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భర్తతోపాటు ఆమె కూడా గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. బాధితురాలు వెంటనే వందకు డయిల్ చేయడంతో క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
Post a Comment