కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని డిఈవో ఎన్ వి దుర్గాప్రసాద్ అన్నారు మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఉపాధ్యాయులు వారికి తగినంత ప్రేరణను అందించాలని ఆయన పేర్కొన్నారు కేవలం పదవ తరగతే కాకుండా అన్ని తరగతుల విద్యార్థులు చదువులో రాణించాలని ఒక టైం టేబుల్ ప్రకారం చిన్నప్పటి నుండి ఒక క్రమబద్ధ జీవనం అలవర్చుకోవాలని పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు అనంతరం పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు మరింత రుచికరమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి, జంగపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు,ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రామకృష్ణ సి ఆర్ పి అనిత రమేష్, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment