విలేకరుల సమావేశం వివరాలు
అమరావతి బడుగు, బలహీనవర్గాల రాజధాని
– ఇన్‌సైడ్ ట్రేడింగ్ విషయంలో రాజీనామాకు మీరు సిద్ధమా?
– ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు సవాల్
– పంచుమర్తి అనురాధ
(టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి)
కావాలని చెప్పి ఒక సామాజిక వర్గానిదని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తు వారికి ఇదే మా సమాధానం.
ఈ రాజధాని దళిత రాజధాని..ఈ రాజధాని బడుగు, బలహీన వర్గాల రాజధాని.
రాజధానికి తూట్లు పెట్టి సినిమా చూసినట్లు చూస్తుంటే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అటువైపు చూడలేదు.దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు.
సామాజిక వర్గం అని మాట్లాడే మీరు వైజాగ్‌లో ఏ సమాజికవర్గంతో వ్యాపారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు.
వైవి సుబ్బారెడ్డి పాట్నర్ ఎవరో మీ మనస్సాక్షికి తెలుసు.
వైసీపీ నాయకులు మాట్లాడితే ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. జూన్ 2వ తేది అమరావతికి రావటం జరిగింది. సెప్టెంబర్ 4 వ తేదిన అమరావతిని రాజధానికి ప్రకటించడం జరిగింది.
ఈ నాలుగు నెలల కాలంలో రాజధాని ప్రాంతంలో 125 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ఎలా ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతారు?
4 వేల ఎకరాలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎలా చెబుతారు?
నిజంగా ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? మా ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా?
చంద్రబాబునాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో ముందున్న నాయకుడు.
తెలుగుదేశం హయాంలో వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా చేయటానికి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం చేయటం జరిగింది.
ఈరోజు జగన్మోహన్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ పెట్టాలనుకున్న మిలీనియం టవర్స్ చంద్రబాబునాయుడు కట్టించినదే.అదేవిధంగా అక్కడున్న టెంపుల్స్‌నుగానీ, లూలూ కంపెనీలు, అదానీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబునాయుడే.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిధులు కేటాయించటంగానీ, ఫస్ట్ ఫేస్ పూర్తిచేయడం జరిగింది. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 90 వేల ఎకరాలకు నీరందించటం జరిగింది.
ఉత్తరాంధ్రతోపాటు 13 జిల్లాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఆక్వా కల్చర్, ఆటో మొబైల్స్ తీసుకురావటం.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లావా అవంతి సీడ్స్, పతాంజలి, జయ్ ఇరిగేషన్ , పార్లే, జెర్సీ ఇండస్ట్రిస్ గ్రూప్, టాటా ఫ్రూట్స్, ఐటిసి ఇంకా మరిన్ని పరిశ్రమలు తీసుకురావటం జరిగింది.
ఆటో మొబైల్స్ రంగంలో కియా మోటార్స్, అపోలో, అశోక్‌లైలాండ్, భారత్ ఫోర్స్, హీరో గ్రూప్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది.
సెల్‌ఫోన్ తయారీ రంగంలో ఫ్రాగ్స్ కాల్, ఎలక్ట్రానిక్స్, డిక్సిన్, టిసిఎల్, వోల్టా వంటి పరిశ్రమలు తీసుకురావటం జరిగింది.
ఫార్మా రంగంలో స్పైరా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, లూపిన్స్, అరవింద ఫార్మా, దివి ల్యాబ్స్, నాట్కో ఫార్మా తదితర కంపెనీలు తీసుకురావటం జరిగింది.
కృష్ణపట్నం, ఓర్వకల్లు, హిందూపురం నియోజకవర్గాల్లో సీబీఐసీ కింద 3 పారిశ్రామిక రోడ్లను అభివృద్ధి చేయటం జరిగింది.
విశాఖపట్నం, శ్రీకాళహస్తి, మచిలీపట్నం, దొనకొండ ఈ నాలుగు చోట్ల పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావటానికి కృషి చేశారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఫుడ్ పార్కులు… కడప, చిత్తూరు జిల్లాలలో సమీకృత ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయటం జరిగింది.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుతోపాటు మెగా పారిశ్రామిక పార్కు కోసం 6,553 ఎకరాలు సేకరించడం జరిగింది.
తెలుగుదేశం ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షించి 60 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం మీ వ్యాపారాల కోసం 3 చోట్ల రాజధానులు పెడతారా?
టైటానియం, బాక్సైట్, రసాల్‌ఖైమా ప్రతాప్‌రెడ్డి 10 వేల ఎకరాలు లక్ష కోట్ల వ్యాపారం చేశారు.
అండ్రక్ అనిల్‌కుమార్ 1866 ఎకరాలు 2,500 కోట్ల వ్యాపారం
బీచ్ శ్యాండ్ వ్యాపారం రూ. 25,290 కోట్లకు సంబంధించి కర్నూలులో పెన్నా సిమెంటుకు సంబంధించి రూ. 3 వేల కోట్లు అదేవిధంగా అమరావతిలో కూడా సరస్వతి భూములు లయన్స్‌స్టోన్‌లో 15 వందల ఎకరాలు.
ఉత్తరాంధ్రలో లక్ష్యం టైటానియం. ఏదైతే న్యూక్లియర్ బాంబులో ఉపయోగించే పదార్థాన్ని అమ్ముకోవటం కోసం కెవిపి రామచంద్రరావు, కోనేరు ప్రసాద్ జగన్మోహన్‌రెడ్డి బినామీలు అందరూ కూడా అందులో ఉన్నారు.
దీనికి సంబంధించి కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ ఇంటర్‌పోల్ వాళ్ల నోటీసు ఇస్తే స్టే తెచ్చుకొని దాక్కొని ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి మిత్రుడిని విదేశాల్లో అరెస్టు చేశారు.
ఈ విధంగా ఉత్తరాంధ్రను రౌడీయిజం, దౌర్జన్యం, దగా చేసి దోచుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.
కులమంటే అంటని ప్రాంతం విశాఖపట్నం. అందుకనే విజయలక్ష్మిని ఓడించారు.
విజయవాడతో పోల్చిస్తే 10రేట్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం.
గుంటూరుతో పోల్చిస్తే 15 రెట్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం ఉంది.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రెండు కుర్చీలు, రెండు బేంచీలు వేసి ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ నాశనం చేయటానికి వైసీపీ కంకణం కట్టుకుని ఉంది.
ఎగ్జిక్యూటివ్ రాజధాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అమరావతిలోని రాజధాని ప్రజల ఆందోళన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
వైసీపీవారు ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజలు దీన్ని గ్రహించి ఈ ఉచ్చులో పడొద్దని మనవి చేస్తున్నాను.
Post a Comment