నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 0500 గంటల వరకు జిల్లాలోని ప్రతి పొలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారు
ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించి,వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుందని,పట్టుబడ్డ వ్యక్తుల యొక్క వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై
చట్టపరంగా కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మద్యం సేవించి స్నేహితులతో రోడ్డుపై ప్రయాణించినట్లయితే ప్రమాదాలకు గురై ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే కోల్పోకూడదని ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ సంతోషకరమైన దినమును విషాదకరమైన దినముగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. కొత్త సంవత్సరానికి ఎన్నో ఆశలతో, ఆశయాలతో మరెన్నో లక్ష్యాలతో ఎంతో సంతోషంతో స్వాగతం పలుకుతూ యువకులు,విద్యార్థులు,అన్ని వర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని,పటిష్టమైన బందోబస్తు మరియు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని కోరారు.అనుమానాస్పద వ్యక్తులు కనబడితే విచారించి అదువులోకి తీసుకోవడం జరుగుతుంది.వాహనాలకు నెంబర్ లేకుండా,సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్ లేకుండా నడుపు వాహనాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డిసెంబర్ 31నాడు రాత్రి తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి ప్రమాద మరియు నష్ట నివారణ దృష్ట్యా పోలీసు వారు చేయు సూచనలు
1, మైనర్,యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్లయిన తమ పిల్లలకు బైకులు ఇవ్వరాదు.పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
2, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కావున అధిక వేగంతో వాహనాలు నడుపరాదు.
3, మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల గురించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
4, అధిక శబ్దాలను చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
5, గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం మరియు వాహనాలతో ర్యాలిగా వెళ్లడం చేయరాదు.
6, రోడ్లపై టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.
7. డీజేలు నిషేధించడం జరిగింది.ఎక్కడైనా ఉపయోగిస్తే వాటిని సిజ్ చేసి
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు
8. ఇండ్ల పైన, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడం మరియు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
9. త్రిబుల్ రైడింగ్ ,సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
10.బహిరంగ ప్రదేశాల్లో,ప్రభుత్వ స్థలాల్లో,ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మద్యం సేవిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు రక్షణ చర్యలకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ, ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య
జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
Post a Comment