కాసేపటి క్రితం సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రహణం పాక్షికంగా కనిపించనుంది. హైదరాబాదులో ముప్పావు వంతు గ్రహణం కనిపించనుంది. గ్రహణం నేపథ్యంలో, శ్రీకాళహస్తి ఆలయం మినహా అన్ని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం అనంతరం సంప్రోక్షణ తర్వాత ఆలయాలు తెరుచుకోనున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మధ్యాహ్నం 2 గంటలకు తెరుచుకుంటుంది. ఉదయం 9.04 గంటలకు సూర్యగ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంది. అనంతరం ఉదయం 10.47 గంటలకు గ్రహణం ముగియనుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకన్ల పాటు కనిపించనుంది.
Post a Comment