దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఖననం చేయబడిన ఆయేషా మీరా మృతదేహాన్ని మరోసారి బయటకు తీసి రీ పోస్ట్ మార్టమ్ చేయించాలని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు స్థానిక అధికారులను సంప్రదించారు. 2007లో డిసెంబర్ 27న విజయవాడ శివారు ప్రాంతాల్లో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పుత్రులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా, అవి నిరూపితం కాలేదు. కేసుకు సంబంధం లేని సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘకాలం పాటు కేసు సాగగా, తొమ్మిదేళ్ల జైలు జీవితం అనంతరం సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆపై కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కొన్ని నెలల క్రితమే మృతదేహం అవశేషాలను బయటకు తీయాలని భావించినా, కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఈ నెల 30లోగా రీ పోస్ట్ మార్టమ్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Post a Comment