విజయవాడ : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ‘పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా? అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు’ అని అన్నారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబుపై సుజనా చౌదరి కూడా విమర్శలు చేశారని, వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని వ్యాఖ్యానించారు.
విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వంలో ప్రతీకార కోరిక ఎక్కువైందని అన్నారు. ప్రత్యర్థులను హింసిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
https://www.youtube.com/watch?v=Bk4Y0k0Zecg&t=32s
Post a Comment