కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సింగిల్ విండో లో జరిగిన అవినీతి అక్రమాల పై విజిలెన్స్ కేసులు పెట్టాలని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్ కు శుక్రవారం చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బండి ఆదిరెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు
ఆ తర్వాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ పునర్విభజన తర్వాత గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చిగురుమామిడి సింగిల్ విండో కు ఇంచార్జ్ ఇస్తే 500మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో 70మంది రైతులు ధాన్యాన్ని అమ్మితే 147మంది ధాన్యాన్ని అమ్మినట్టు లెక్కల్లో చూపి సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. దళారీలు వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ ఇచ్చిన కమీషన్ కోసం ఈ కేంద్రం ద్వారా అమ్మకాలు చూపించారని ఆరోపించారు. చిగురుమామిడి సింగిల్ విండో తో పాటుగా చొక్కారావు పల్లె కేంద్రాన్ని విజిలెన్స్ తో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, బిజెపి జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, కొంకటి లక్ష్మణ్, పింగళి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment