విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు ‘ఇసుక దీక్ష ప్రారంభం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 8 గంటలకు ‘ఇసుక దీక్ష’ ప్రారంభించనున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నాచౌక్‌లో ప్రారంభం కానున్న చంద్రబాబు నిరాహార దీక్ష రాత్రి ఎనిమిది గంటలకు ముగియనుంది.

ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌తో చంద్రబాబు ఈ దీక్షకు దిగారు.

దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలతోపాటు, 125 వృత్తులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులను దీక్షకు ఆహ్వానించారు. ఇసుక కొరతతో నష్టపోయిన వ్యాపార రంగాల ప్రతినిధులనూ పార్టీ ఆహ్వానించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post