ఖాతాలు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది .. 500 మంది ఇండియన్లకు గూగుల్ వార్నింగ్!

గూగుల్‌ 500 మంది ఇండియన్స్ సహా, ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందికి హెచ్చరికలు పంపింది. జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య ఈ హెచ్చరికలు పంపినట్టు సంస్థ వెల్లడించింది. వీరి ఖాతాలు ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని పేర్కొంది. తమ హెచ్చరికలు అందుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ లో ఉన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని, పెగాసస్‌ సాఫ్ట్‌ వేర్‌ సాయంతో కొన్ని దేశాల ప్రభుత్వాలు మానవ హక్కులపై పోరాడుతున్న కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారాన్ని హ్యాక్‌ చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతు హ్యాకర్లు, 270 మందిని లక్ష్యంగా చేసుకున్నారని కూడా గూగుల్ వెల్లడించడం గమనార్హం.

0/Post a Comment/Comments

Previous Post Next Post