ఇండియాలో తొలిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ కాప్ ను సాధించిన సంస్థగా నిలిచింది రిలయన్స ఇండస్ట్రీస్ . నేటి స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ ఈక్విటీ విలువ 1 శాతం పెరిగి రూ. 1,580 దాటిన వేళ, రిలయన్స్ మార్కెట్ కాప్ రూ. 10 లక్షల కోట్లను దాటింది. ఈ సంవత్సరం అక్టోబర్ 18న రూ. 9 లక్షల కోట్ల మార్కెట్ కాప్ ను తాకింది. ఆపై నెలన్నరలోనే మార్కెట్ కాప్ ను మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెంచుకుంది. ఇటీవలి కాలంలో టెలికం టారిఫ్ లను పెంచడం, సంస్థ రెండో త్రైమాసికం లాభాలు, రిలయన్స్ నిర్వహిస్తున్న చమురు కేంద్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మొదలు కావడం వంటి కంపెనీలతో సంస్థ ఈక్విటీకి డిమాండ్ ను పెంచాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ తరువాతి స్థానంలో టీసీఎస్ నిలిచింది. ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ కాప్ రూ. 8 లక్షల కోట్లుగా ఉందన్న సంగతి తెలిసిందే.
Post a Comment